English   

గుణశేఖర్‌ శాకుంతలంలో పూజాహెగ్డే

Pooja hegde
2020-12-28 16:35:41

తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ 'శాకుంతలం' పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తన ట్విట్టర్‌ ఖాతాలో ఈ సినిమా మోషన్‌పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటించనున్నారనే విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రధానపాత్రలో పూజాహెగ్డే అయితే బాగుంటుందని గుణశేఖర్‌ భావించారట. ఈ మేరకు ఇప్పటికే ఆయన పూజాతో సంప్రదింపులు జరిపినట్లు వినికిడి.  పాన్ ఇండియా కథాంశంతో భారీ బడ్జెట్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా క్రేజీ ప్రాజెక్టును ప్రకటించిన గుణశేఖర్ ఎవరినీ లీడ్ రోల్ కోసం ఎంపిక చేస్తాడో చూడాలి.

More Related Stories