English   

ర‌వితేజ‌ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

Ravi Teja Krack
2020-12-28 18:54:50

మ‌హారాజా ర‌వితేజ క్రాక్ సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, పోస్టర్‌లు చిత్రంపై అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్‌ రవితేజ అభిమానులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇవ్వనుంది. జనవరి 1న చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.ట్రైల‌ర్ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర బృందం. ర‌వితేజ, శ్రుతిహాస‌న్ హుషారుగా ఓ పాట‌లో డాన్స్ చేస్తూ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. ర‌వితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్పట్లా ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడ‌ర‌న్ లుక్‌లో అల‌రిస్తున్నారు. ఆ ఇద్దరి మ‌ధ్యా కెమిస్ట్రీ చూస్తుంటే రేపు థియేట‌ర్లలో ఆడియెన్స్‌కు పండ‌గేన‌ని చెప్పొచ్చు. 

More Related Stories