జబర్దస్త్ సుదీర్ కు షాక్..సినిమా షూటింగ్ పై స్థానికుల ఆగ్రహం

జబర్దస్త్ నటుడు సుడిగాలి సుదీర్ ప్రస్తుతం సినిమాల్లోనూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుదీర్ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఓ వైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తునే మరోవైపు హీరోగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అయితే తాజాగా సుదీర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతుంది. అయితే సినిమా షూటింగ్ జరపకూడదని స్థానికులు అడ్డుకున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో నివాసప్రాంతంలో షూటింగ్ జరపొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో చిత్ర యూనిట్ పోలీస్ లను ఆశ్రయించింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. షూటింగ్ కు పర్మిషన్ ఉందని పోలీసులు స్థానికులకు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండటం తో తమ ప్రాంతాల్లో షూటింగ్ లు జరగటం పై స్థానికులు భయపడుతున్నారు. దానికి తోడు సినిపరిశ్రమకు చెందిన వారికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు.