English   

యంగ్ హీరో అడవి శేషుకు కోర్ట్ నోటీసులు

adivi sesh
2020-12-29 15:32:00

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "2 స్టేట్స్" సినిమాకు తెలుగులో రీమేక్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అడవి శేషు హీరోగా..శివాని హీరోయిన్ గా ప్లాన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం లేదనే కారణంతో ఈ ప్రాజెక్ట్ నుండి అడవి శేషు తపుకున్నట్టు తెలుస్తోంది. దాంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా శివాని కి మొదటి సినిమా కావడంతో శివాని పరిచయం కూడా ఆలస్యం అయింది. దాంతో ఆమెను వేరే సినిమాతో పరిచయం చేయాలని చూస్తున్నారు. కాగా సినిమా షూటింగ్ కు బ్రేక్ పడటానికి అడవి శేషునే కారణమని చిత్ర నిర్మాత సత్తి బాబు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హీరో అడవి శేషుకు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు. అంతే కాకుండా సినిమా ఆగిపోవడంతో తనకు తీవ్ర నష్టం జరిగిందని సత్తిబాబు కోర్టును ఆశ్రయించారు. న్యాయం చేయాలని కోర్ట్ లో పిటిషన్ వేసారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు జనవరి 5 లోగా వివరణ ఇవ్వాలని అడవి శేషుకు నోటీసులు పంపారు. ఇక ఈ నోటీసులపై అడవి శేషు ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Related Stories