మెగా ఫ్యామిలిలో కరోనా కలకలం..వరుణ్ తేజ్ కు పాజిటివ్

మెగా ఫ్యామిలిలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చరణ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఎలాంటి సింటమ్స్ లేవని త్వరలోనే కోలుకుంటానని చరణ్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. తనకు కొన్ని లక్షణాలు ఉన్నాయని వరుణ్ తేజ్ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లోనే చికిత్స్ తినుకుంటున్నట్టు వరుణ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా మెగా హీరోలు ఇద్దరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. మొన్న జరిగిన క్రిస్మస్ పార్టీలో చరణ్, వరుణ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు, మెగా డాటర్స్ , మెగా అల్లుళ్ళు పాల్గొన్నారు. దాంతో వారికి కూడా కరోనా సోకుతుందనే అనుమానాలు మొదలవుతున్నాయి. తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.