అల్లుడు అదుర్స్‌లో మోనాల్ ఐటెమ్ సాంగ్

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్'. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడు మోనాల్ గజ్జర్ ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో నటిస్తుంది.ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఆధ్వర్యంలో నిర్మించిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే ఈ పెప్పీ నంబర్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. బిగ్‌బాస్ 4లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచినమోనాల్ గజ్జర్‌కు చాలా బాగానే అవకాశాలు వస్తున్నాయట. రీసెంట్‌గానే ఓంకార్ స్టార్ట్ చేసిన డాన్స్ ప్లస్ షోలో మోనాల్ భాగమైంది.మొత్తానికి బిగ్‌బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌ను మోనాల్ బాగానే క్యాష్ చేసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నాయికలుగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోను సూద్, వెన్నెల కిశోర్, సత్యా కీలక పాత్రధారులు.రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.