పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి

బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్‌గా వస్తున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి కావడంతో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. షూటింగ్ పూర్తైన ఆనందంలో దర్శకుడు వేణు శ్రీరామ్‌ను హత్తుకున్నాడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్, అరకు సహా మరికొన్ని లొకేషన్స్ లో వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఈ చిత్రం కోసం స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు పవర్ స్టార్. జనవరి 1న వకీల్ సాబ్ టీజర్ విడుదల కానుందని తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరగా పూర్తి చేసి మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.