English   

పెళ్లికి రెడీ అవుతున్న కీర్తి సురేష్.. సినిమాలకు గుడ్ బై చెబుతుందా

Keerthy Suresh
2020-12-30 12:51:50

మహానటి కీర్తి సురేష్ పెళ్లికి రెడీ అవుతోందట. అది ఏ సినిమాలోనో కాదు రియల్ లైఫ్ లో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన నటించిన కీర్తి సురేష్ మహానటి సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కింది. బేసిక్ గా మలయాళ కుట్టి అయినప్పటికీ కీర్తి సురేష్ తెలుగమ్మాయిలా కనిపిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ అమ్మడికి పెళ్లి సంబంధం ఓకే అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె అభిమానులు ఇకపై కీర్తి సినిమాల్లో నటించదేమో అని ఆందోళన చెందుతున్నారు. కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్ కాకుండా పద్ధతిగా పెద్దలు కుదిర్చిన పెళ్ళికే ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఓ యువ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి ఫిక్స్  అయిందట. కాకపోతే 2021 ఏప్రిల్ లో కీర్తి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారట. కానీ కీర్తి మాత్రం పెళ్లిని వాయిదా వేయాలని కోరుతుందట. ఒకవేళ పెళ్లి వాయిదా పడకుండా ఉంటే మాత్రం కీర్తి ఏప్రిల్ లో పెళ్లి పీటలు ఎక్కుతుంది. ఇక పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెబుతుందా.? లేదంటే సినిమాలు చేస్తూనే సంసార సాగరాన్ని ఈదుతుందా.? అన్నది తెలియాలంటే కీర్తి నోరు  విప్పాల్సిందే.

More Related Stories