సాక్షి వైద్యతో అఖిల్ రొమాన్స్

2020-12-30 13:42:52
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. వచ్చే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత అఖిల్ తన 5వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ చేయబోతున్నాడు అఖిల్. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అఖిల్ కి జోడీగా సాక్షి వైధ్య నటించే అవకాశముందని అంటున్నారు. ఈ విషయంపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.