న్యూ ఇయర్ కోసం బాయ్ ఫ్రెండ్ తో మాల్దీవులకు కియారా అద్వానీ

సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ రిలేషన్షిప్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కియారా సిద్దార్థ్ మల్హోత్రా మాస్కులు పెట్టుకుని ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ తన ప్రియుడు సిద్దార్ధ్ మల్హోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దార్ధ్ మల్మోత్రతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాలకు చిక్కింది. ఈ యువ జంట న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం మాల్దీవులకు వెళ్తున్నట్టు టాక్. అక్కడ ఓ వారం రోజుల పాటు వీళ్లిద్దరు కలిసి ఎంజాయ్ చేయనున్నారట. గతంలో వీళ్లిద్దరు 2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆఫ్రికాకు వెళ్లారు. అపుడు వీళ్లిద్దరు ఎవరి కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈ సారి మాత్రం మీడియా కంట పడిపోయారు. దీంతో ఇన్ని రోజులుగా వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బట్టబయలైంది. కియారా ఇటీవలే లక్ష్మీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది.