English   

రామ్ రెడ్ సాంగ్..న్యూయర్ కోసం డించక్ డించక్ 

RED Dinchak
2020-12-30 18:26:24

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూయర్ పార్టీ కోసం ఈ సినిమాలోని డించక్ డించక్ స్పెషల్ లిరికల్ సాంగ్ ను ఈ రోజు విడుదల చేశారు. ”ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూక కే  జింక ...డించ క్  డించ క్  డింక .. మా బీచ్ కి రావే ఇంక “ అంటూ కాసర్ల శ్యామ్ రాయగా, సాకేత్, కీర్తనా శర్మ ఆలపించిన  ఈ పాటకు  జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. 

ఈ పాట గురించి నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ..హెబ్బా పటేల్ కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. రామ్ తన స్టెప్స్ తో ఇరగదీసేశారు.ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా  రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్ లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.” అని చెప్పారు.

నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్ మాట్లాడుతూ “సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ ఇది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా సెట్ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయం తో ఈ పాట  చిత్రీకరించాం.దీంతో పాటు ఈ సినిమా లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14 న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.” అని తెలిపారు.   ‘ఇస్మార్ట్ శంకర్ ‘ తర్వాత రామ్ చేసిన ఈ సినిమా క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ పేర్కొన్నారు.   నివేదా పేతురాజ్ , మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు.   

More Related Stories