English   

ప్రియదర్శి మెయిల్ టీజర్ టాక్ 

Priyadarshi Mail
2020-12-31 13:20:56

స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక ద‌త్, స్వప్న ద‌త్ నిర్మాత‌లుగా ఉద‌య్ గుర్రాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్‌’‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ వెబ్ సిరీస్ ఛాప్టర్ 1 ‘మెయిల్’ను విడుదల చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 'ఆహా' ఓటీటీ వేదికగా విడుదల కానుంది.ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

అందులో 'కంప్యూటర్ నేర్చుకోవాలంటే నేను చెప్పే మూడు షరతులను కచ్చితంగా పాటించాలి.. మొదటిది స్నానం చేసి రావాలి.. రెండవది చెప్పులు బయటనే విడిచి పెట్టాలి.. మూడవది నేను చెప్పిన సమయానికి రావాలి.. అంతేకాకుండా అంజి, రమేశ్ లాగా మరొక దుకాణం ప్రారంభిస్తా అంటే మంచిగా ఉండదు' అనే మాటలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.అసలు ఆ ఊరేంటి? ఆ ఊరిలో కంప్యూటర్‌ కథేంటి? కంప్యూటర్‌ వల్ల వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి?  అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

More Related Stories