ధనుష్ డైరెక్టర్ కి కరోనా..ఆందోళనలో అభిమానులు

బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కరోనా బారిన పడ్డారు. ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని, యాక్టివ్గానే ఉన్నానని, అయితే వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం సెల్ఫ్ క్వారెంటైన్లో ఉన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆనంద్ రాయ్‌కు కరోనా రావడంతో ఆయన డైరెక్షన్ చేస్తున్న 'ఆత్రంగి రే' యూనిట్లో కలవరం మొదలైంది. సినిమాలో ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్ పాత్ర చిత్రీకరణ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ నిన్న కేక్ కటింగ్ చేసింది. ఈ వేడుకలో దర్శకుడి వెంట ధనుష్, సారా అలీఖాన్ కూడా ఉండటంతో వారి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. గత రెండు మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆ తర్వాత కొవిడ్ 19 నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆనంద్ రాయ్ కోరారు.