English   

బ‌స్ న‌డిపిన త‌మ‌న్నా..వీడియో వైరల్

 Tamannah
2020-12-31 14:02:31

హ్యాపీడేస్ సినిమాతో కుర్రకారును ఆకర్షించిన అందాల భామ తమన్నా. చూడ్డానికి పాలలా అతిలోక సుందరిలా కనిపించే ఈ అమ్మడికి మిల్కి బ్యూటీ అని పేరు పెట్టేసారు. టాలీవుడ్ లో దాదాపు టాప్ హీరోలు అందరి సరసన నటించిన ఈ భామ ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తుంది. అంతే కాకుండా ఆహాలో ఓ టాక్ షోను కూడా చేస్తోంది. ఇక ఇటీవల కరోనా బారిన పడ్డ మిల్కి బ్యూటీ త్వరగానే కోలుకుని మళ్ళీ షూటింగ్ లలో బిజీ అయింది. అయితే కరోనా వచ్చినప్పుడు చనిపోతానేమో అని చాలా భయపడినట్టు తమన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాకుండా కొలుకున్నాక శరీరంలో వచ్చిన మార్పుల గురించి అంతా అడుగుతున్నారని..కానీ ఎవరూ ఆరోగ్యం గురించి ఎవరూ అడగటం లేదని చెప్పింది. ఇక కరోనా ను జయించిన ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ హీరోగా నటిస్తున్న సీటీమార్ సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సెట్ లో తమన్నా బస్ నడిపి అందరిని ఆశ్చర్య పర్చింది. బస్ నడిపిన వీడియోను మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

More Related Stories