మాస్ మహారాజ్ ఖిలాడీ సర్ప్రైజ్

2020-12-31 21:27:16
ప్రస్తుతం రవితేజ ఖిలాడీ షూటింగ్‌తో బిజీగా వున్నాడు. రవితేజ కెరీర్లో 67వ సినిమాగా రాబోతున్న ఈ 'ఖిలాడీ' మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ మాస్ అభిమానులను అట్రాక్ట్ చేస్తూ విశేష స్పందన తెచ్చుకుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి 2021 సర్ప్రైజ్ రెడీగా ఉందని తెలిపారు. రేపు అనగా 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.డా.జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.