అల్లు అర్జున్ కు దిశా పటానీ షాక్.. భారీ డిమాండ్

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియన్ చిత్రం 'పుష్ప'. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. ఈ ఇద్దరీ కాంబినేషన్లో ఇంతకు ముందు ఆర్య, ఆర్య2 రాగా.. ఇది మూడవ చిత్రం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపించనున్నారు.అది అలా ఉంటే సుకుమార్ సినిమాల్లో మామూలుగా ఐటమ్ సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ అదిరిపోయే ఐటెమ్ సాంగ్ ఉండనుందట.
ఐటెమ్ సాంగ్లా కాకుండా సినిమాకు తగ్గట్టు కొంచెం ఫోక్ బీట్తో స్పెషల్ సాంగ్‌ను ఈ సినిమా కోసం చిత్రీకరించనున్నారట. అయితే, ఈ పాట కోసం బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిశాపటానీని 'పుష్ప' టీమ్ సంప్రదించిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈ పాట కోసం ఆమె రూ.1.5 కోట్లు డిమాండ్ చేసిందట. దింతో ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ రేంజ్ విని దిమ్మతిరిగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పుష్ప నిర్మాతలు దిశాపటానీ డిమాండ్ తో పునరాలోచనలో కూడా పడినట్టు జోరుగా చర్చ నడుస్తోంది.