స్టార్ లు తమ పిల్లలను అలా చేసి చెడగొడుతున్నారు..తేజ షాకింగ్ కామెంట్స్

ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే టాలీవుడ్ దర్శకుల్లో తేజ ఒకరు. తేజ ఏ ఇంటర్వ్యూ చూసినా చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోను ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్టార్ హీరోలు తమ పిల్లలను సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలను చేసి చదువుకునే వయసులోనే జీవితాలను పాడు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీలను చేయడం వల్ల వాళ్ళు స్కూల్లో కొన్ని ఇబ్బందులు పడతారని ఆయన అభిప్రాయపడ్డారు.
పిల్లలకు భయట ప్రపంచం తెలియకపివడమే మంచిదని అన్నారు. లేకుంటే మీరు పేరెంట్స్ ఇబ్బంది పడటమో వేరేవాళ్ళు ఇబ్బంది పడటమో జరుగుతుందని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా హీరోలు తమ ఎదుగుతున్న పిల్లల ఫోటోలు ఎలా షేర్ చేస్తే అలా తమ ఫ్యాన్ బేస్ తగ్గుదన్నారు. ఇదిలా ఉండగా తేజా ఒకప్ప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. గ్యాప్ లేకుండా వరుస పెట్టి సినిమాలను తీశారు. అయితే కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన మళ్ళీ "నేనే రాజు నేనే మంత్రి" సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సినిమా విజయం సాధించడంతో మళ్ళీ ట్రాక్ లో పడ్డాడు.