English   

రజనీకాంత్ రాజకీయాలపై మోహన్ బాబు లేఖ విడుదల

Mohan babu
2020-12-31 17:34:08

నటుడు మోహన్ బాబు అనేక సంధర్భాల్లో తనకు రజినీకాంత్ మంచి మిత్రుడని చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల రజినీకాంత్ అస్వస్థతకు గురైనప్పుడు కూడా మోహన్ బాబు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. అయితే తాజాగా మోహన్ బాబు రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదంటూ ట్విట్టర్ లో ఓ లేఖను పోస్ట్ చేసారు. లేఖలో మోహన్ బాబు..."రజినీకాంత్ నాకు అత్యంత సన్నిహితుడన్న సంగతి మీ అందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్ లోకి రావడంలేదని ప్రకటించాడు. ఒకరకంగా ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని నమ్ముతున్నాను. నా మిత్రుడి ఎన్నో సంధర్భాల్లో చెప్పాను. నువ్వు మంచి వాడివి చీమకు కూడా అపకారం చేయనివాడివి. నా దృష్టిలో వన్ ఆఫ్ ధ గ్రేటెస్టు పర్సన్ నువ్వు. 

నీ లాంటి వ్యక్తికి...నా లాంటి వ్యక్తికి రాజకీయాలు పనికి రావు. ఎందుకంటే మనం నిజాన్ని నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం. ఎవరికి ద్రోహం చేయం. డబ్బులిచ్చి సీట్లు, ఓట్లు కొనలేం..కొనము కూడా. రాజకీయాల్లోకి రాకముందు మంచి వాడివి అన్న నోళ్లే రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి. రాజకీయం ఒకరొచ్చు..ఒక బురద. అలాంటి బురద అంటుకోకుండా నువ్వు రాజకీయాల్లోకి రాకపోవడమే మంచింది.  రజినీకాంత్ అభిమానులు అందరూ రజినీ అంత మంచోళ్ళు. రజినీకాంత్ నిర్ణయాన్ని మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను." అంటూ మోహన్ బాబు పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు కూడా అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం రాజకీయలలు దూరంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన చేసిన కామెంట్లు ఆసక్తిగా మారాయి.

More Related Stories