రవితేజ క్రాక్ కి వెంకీ వాయిస్ ఓవర్

మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న హాట్రిక్ సినిమా క్రాక్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా.. నిర్మాతలతో పాటు రవితేజ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ బయటకు వచ్చింది. మహారాజా రవితేజ క్రాక్ చిత్రానికి సీనియర్ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ సినిమా కథకు సంబంధించిన వాయిస్ ఓవర్ వెంకటేష్ చెబుతున్నారట. క్రాక్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు.