English   

కామెడీ విలన్ నర్సింగ్ యాదవ్ కన్నుమూత 

Narsing Yadav dead
2021-01-01 11:52:07

ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన నిన్న రాత్రి మృతి చెందారు. మైలా నర‌సింహ యాద‌వ్‌. ఇండ‌స్ట్రీలో అంద‌రూ న‌ర‌సింగ్ యాద‌వ్ అని పిలుస్తారు. 1963 మే 15న హైద‌రాబాద్‌లో జన్మించిన ఆయ‌న‌కు భార్య చిత్ర‌, కొడుకు రిత్విక్ యాద‌వ్‌ ఉన్నారు. 300ల‌కు పైగా సినిమాల్లో న‌టించి కామెడీ విల‌న్‌గా, విల‌క్ష‌ణ న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 

తెలుగు తో పాటు నర్శింగ్ యాదవ్ హిందీ, త‌మిళ్‌ బాషల్లో  న‌టించారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన బాషాలోనూ ఆయన మంచి కేర‌క్ట‌ర్ చేశారు. విజ‌య‌ నిర్మ‌ల ద‌ర్శక‌త్వం వ‌హించిన హేమాహేమీలు సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. క్ష‌ణ‌క్ష‌ణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్‌, శంక‌ర్ దాదా ఎంబీబీయ‌స్‌, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్ల‌జ‌మీందార్‌, సుడిగాడు, కిక్‌ త‌దిత‌ర చిత్రాల్లో ఆయ‌న చేసిన కేర‌క్ట‌ర్ల‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇటీవ‌ల చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబ‌ర్ 150లోనూ న‌టించారు. నర్సింగ్ యాదవ్ కి కిడ్నీ సంబంధిత వ్యాధి రావడంతో గ‌త కొంత‌కాలంగా ఆయనకు డ‌యాలిసిస్ జ‌రుగుతోంది.

More Related Stories