English   

వకీల్ సాబ్ పోస్టర్..సంక్రాంతికి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్

 Pawan Kalyan
2021-01-01 12:34:54

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 31 న అర్దరాత్రి సినిమా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా టీజర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. విడుదలైన పోస్టర్ లో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉంది. సినిమాలో శృతి లుక్ ను రిలీజ్ చేయడం ఇదే మొదటి సారి. ఈ సినిమాతో కలిపి శృతిహాసన్ ఇప్పటివరకు పవన్ సరసన మూడు సార్లు నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇటీవలే సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. దాంతో సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోణి కపూర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న థమన్ ఈ సినిమాకు స్వరాలను సమకూరుస్తున్నారు. ఇక హిందీ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ వస్తుంది. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి వకీల్ సాబ్ ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా చూడాలి.
 

More Related Stories