English   

రవితేజ క్రాక్‌ ట్రైలర్‌ టాక్..నో డౌట్ పేలిపోయింది

 Krack Movie Trailer
2021-01-01 15:10:36

మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ ట్రైలర్ ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్‌.. ఇక్కడ కామన్‌ పాయింట్‌ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ..’ అంటూ ట్రైలర్‌ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ అదిరిపోయింది.  

‘శంకర్‌... పోతరాజు వీరశంకర్‌, ఒంగోలు నడి సెంటర్‌లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా.., శంకర్‌.. ష్యూర్‌ షాట్‌.. నో డౌట్‌.. పుచ్చె పేలిపోద్ది అంటూ రవితేజ చెప్పిన మాస్‌ డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది.  ఇందులో తమిళ నటుడు దర్శకుడు సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ - రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్ సంగీతం అందించాడు.

More Related Stories