అమ్మాయిలను పడేస్తున్న జగపతిబాబు

జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం FCUK..ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్. కొత్త దర్శకుడు విద్యాసాగర్ రాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమకు సంబంధించి ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్ పాత్రలను రివీల్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు టీజర్‌ని రాజమౌళి చేత విడుదల చేయించారు. ఇందులో ఫణి భూపాల్ అనే రొమాంటిక్ ఫాదర్ పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నాడు. గాలికి తెలియంత వేగంగా రాముడు బాణం విసిరినట్లు ఇతను అమ్మాయిలను పడేస్తాని టీజర్ లో వెల్లడించారు. అమ్మాయిలని ప్లర్ట్ చేసే అతని కొడుకు పాత్రలో రామ్ కార్తీక్ కనిపిస్తున్నాడు. అలాంటి తండ్రీకొడుకులు లైఫ్ లోకి డాక్టర్ ఉమ మరియు చిట్టి పాత్రలు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నదే 'FCUK' కథాంశంగా టీజర్ చూస్తే తెలుస్తోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కేఎల్ దామోదర ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బీమ్స్ సెసిరొలియా మ్యూజిక్ డైరెక్టర్. కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహస్రిత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.