నితిన్ రంగ్‌దే కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ రంగ్‌దే మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు. మార్చి 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రేమ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్తో రంగ్‌దే మార్చి 26న మీ ముందుకు రానుంది అని వెంకీ అట్లూరీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, ఏమిటో ఇది అనే పాట అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ‘రంగ్ దే’ రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.