English   

మెగాస్టార్ కు విలన్ గా యంగ్ హీరో

 Satya Dev
2021-01-02 14:06:20

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. ఇటీవల వచ్చిన సామ్ జామ్ ఇంటర్వ్యూలో కూడా చిరు ఇకపై సినిమాలు తప్ప వేరే పనిలేదని స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో "ఆచార్య" అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ కు ముందు కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అయింది. దాంతో ఇటీవల మళ్ళీ పట్టాలెక్కించి వేగం పెంచారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే చిరు మరో రెండు రీమేక్ సినిమాలు వేదళం, లూసిఫర్ ల కు ఒకే చెప్పాడు. అయితే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తయ్యాక మొదట "లూసిఫర్" సినిమాను పూర్తి చేస్తాడట. ఈ సినిమా షూటింగ్ కోసం చిరు మూడు నెలలు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

చిరుకు ఈ సినిమా ఎంతగానో నచ్చిన ఈ సినిమాకోసం రీమేక్స్ స్పెషలిస్ట్ అయిన తమిళ డైరెక్టర్ జయం రాజాను రప్పించాడు. ఇక ఈ సినిమా పై ఓ తాజా అప్డేట్ వచ్చింది. సినిమాలో యంగ్ హీరో సత్య దేవ్ చిరుకు విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. లేదంటే మినిస్టర్ పాత్రలో సత్యదేవ్ కనిపించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మలయాళం లో వివేక్ ఒబేరాయ్ కనిపించిన పాత్రలో సత్య దేవ్ కనిపించనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నయి. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. సినిమాలో రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అమెతోపాటు పలువురు ప్రముఖ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇకఆ చిరు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories