English   

ఏపీలో నిరసనకు దిగిన కరాటే కల్యాణి

Karate Kalyani
2021-01-02 15:20:12

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అంతర్వేది లో రథం దగ్ధం అయిన ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 29న విజయనగరంలోని రామతీర్థం లో రాముడి విగ్రహం పై దాడి జరిగింది. కాగా డిసెంబర్ 30న    కొండపై ఉన్న కొలనులో రాముడి శిరస్సు లభ్యమైంది. రాముడి విగ్రహ తలను తెంపడంపై పై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతే కాకుండా బీజేపీ, టీడీపీ నాయకులు రామతీర్థం కు భయలు దేరుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో దేవలయాలపై జరుగుతున్న దాడులకు నిరసన గా సినీ నటి కరాటే కల్యాణి సైతం ఏపీలో నిరసనకు దిగింది. కాషాయ కండువా కప్పుకుని ఆమె నిరసనలో పాల్గొంది. గతంలో కూడా కరాటే కల్యాణి దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్పందించింది. ఇదిలా ఉండగా కరాటే కల్యాణి ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది. నాలుగు వారల్లోనే భయటకు వచ్చింది.

More Related Stories