English   

విజయ్ రాఘవన్ ట్రైలర్ విడుదల..ఎమోషనల్ ట్వీట్ చేసిన హీరో

 Vijay Antony
2021-01-02 21:30:08

పిజ్జా, బిచ్చగాడు సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన విజయ్ "బిచ్చగాడు" సినిమాతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నాడు. దాంతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు అంచనాలతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమా " విజయ రాఘవన్". కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాలుగు భాషల్లో ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మధ్యాహ్నం 2గంటలకు ఈ టీజట్ ను విడుదల చేసారు. 

అయితే విజయ్ టీజర్ ను విడుదల చేసి ఓ ఎమోషనల్ ట్వీట్ అది కూడా తెలుగులో ట్వీట్ చేశారు. "విజయ రాఘవన్ టీజర్ మీ కోసం.ఇది మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. చూసి మీ ప్రోత్సాహాన్ని లైక్ , కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ  ప్రోత్సాహమే నాకు బలం. 2021 సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది." అంటూ విజయ్ ట్వీట్ చేసాడు. కాగా విజయ్ ట్వీట్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వేరే భాష నటుడు అయినప్పటికీ తెలుగులో ట్వీట్ చేసినందుకు శభాష్ అంటున్నారు. తెలుగు హీరోలకంటే బెస్ట్ అంటూ మెచ్చుకుంటున్నారు. ట్రయిలర్ బాగుంది సినిమా కూడా బాగుంటుంది అంటూ విజయ్ ఆంటోనికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నారు.

More Related Stories