రవితేజ క్రాక్ సెన్సార్ పూర్తి...రిలీజ్ ఎప్పుడంటే

2021-01-02 21:41:38
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా తెరక్కుతున్న సంగతి తెలిసిందే. న్యూయర్ కానుకగా నిన్న (జనవరి 1)న సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదలైంది. కాగా ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక్కరోజులోనే క్రాక్ ట్రైలర్ 1మిలియన్ వ్యూవ్స్ మైలు రాయిని దాటింది. ట్రైలర్ మాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా క్రాక్ యూనిట్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చినట్టు పేర్కొంది. అంతే కాకుండా ఈ సినిమాని జనవరి 9 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే సంక్రాంతికి ఐదు రోజుల ముందు. దాంతో సంక్రాంతి బరిలో రవితేజ దిగితున్నారు. ఈ సినిమా మాస్ మహరాజ్ కు ఎలాంటి విజయం తెచ్చి పెడుతుందో చూడాలి.