English   

దర్శకుడు క్రిష్ కు కరోనా పాజిటివ్

 Director Krish
2021-01-02 21:48:29

టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. స్టార్ హీరోల నుండి డైరెక్టర్ ల వరకు కరోనా సోకుతుంది. దాంతో ఇండస్ట్రీలో ఆందోళన నెలకొంది. షూటింగ్ సెట్ లో పాల్గొంటున్న సభ్యులకు మాత్రమే కాకుండా నటీనటులు కరోనా బారిన పడటంతో ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఇటీవల స్టార్ హీరో రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక క్రిష్ ఇటీవలే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో తెరకెక్కిస్తున్న  సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ను తక్కువ టైం లో  ఇటీవల పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ తరవాత క్రిష్ పవన్ తో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ ఆయనకు కరోనా రావడంతో పవన్ తో సినిమా షూట్ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.

More Related Stories