English   

సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే

Tollywood
2021-01-04 11:12:02

ప్రతి సమత్సరం లాగానే ఈ ఏడాది కూడా సాంక్రాంతి బరిలోకి దిగేందుకు హీరోలు సిద్ధమయ్యారు. అయితే ఈ ఏడాది కారణంగా షూటింగ్ లు పూర్తి కాకపోవడంతో టాలీవుడ్  నుండి స్టార్ హీరోలు ఎవరూ బరిలోకి దిగడం లేదు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమాల రిలీజ్ డేట్ ను ఇప్పటికే చిత్ర యూనిట్ లు ప్రకటించాయి. తెలుగులో మొత్తం ఐదు సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మాస్ మహరాజ్ ముందుగా జనవరి 9న "క్రాక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఈ సినిమా ట్రైలర్ 10మిలియన్ వ్యువ్స్ ను ఒక్కరోజులోనే దాటేసింది. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ సైతం సంక్రాంతి రేసులో ఉన్నాడు. మాస్టర్ సినిమాతో విజయ్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ సైతం ఆకట్టుకుంటోంది. దాంతో ప్రేక్షకులకి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని "రెడ్" సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తయిన ఈసినిమా లాక్ డౌన్ వల్ల విడుదల ఆలస్యం అయింది. 

ఈ సినిమాలో రామ్ డిఫరెంట్ గా కనిపిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సంక్రాంతి రేసులో ఉన్న మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. "అల్లుడు అదుర్స్" సినిమాతో జనవరి 15న బెల్లంకొండ థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ ఐటమ్ సాంగ్...సోనూ సూద్ స్టెప్పులు ఉండటంతో సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. మరోవైపు బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం, మహాత్ రాఘవేంద్ర జంటగా నటించిన "సైకిల్" సినిమా జనవరి 15న విడుదల కానుంది. ఇక ఈ ఐదు సినిమాలలో ఏ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతాయో చూడాలి.

More Related Stories