English   

ఐదేళ్ల తరవాత కలిసిన రవి లాస్య..మళ్ళీ సందడి చేయబోతున్నారా

 Ravi and Lasya
2021-01-04 11:51:35

మా మ్యూజిక్ లో వచ్చిన "సమ్ థింగ్ స్పెషల్" షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన జంట రవి-లాస్య. ఈ ఇద్దరు కలిసి చేసిన షోకు మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా సెలెబ్రెటీలు సైతం వీరి యాంకరింగ్ ను మెచ్చుకున్నారు. లాస్య అమాయకత్వం..రవి కొంటె తనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో ఈ షోకు పెద్ద ఎత్తున అభిమానులు పెరిగిపోయారు. ఆ తరవాత ఈ ఇద్దరూ కలిసి కొన్ని ఈవెంట్లను కూడా చేసారు. కాగా కొన్ని రోజుల తరవాత ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుని విడిపోయారు. 

ఆ తరవాత మళ్ళీ ఒక్క స్టేజ్ పై కలిసి యాంకరింగ్ చేయలేదు. ఇక రవి "పటాస్" షోలో శ్రీముఖి తో మళ్ళీ జోడీ కట్టినప్పటికి లాస్య పెళ్లి చేసుకుని టీవీ షోలకు దూరమయ్యింది. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4 లో లాస్య మళ్ళీ తెరపై కనిపించి అందరిని అలరించిన సంగతి తెలిసిందే. కాగా 5 ఏళ్ళ తరవాత రవి-లాస్య జంట మరోసారి స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని యాంకర్ రవి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి వేడుకల సందర్భంగా స్టార్ మా లో ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొంటుంన్నారు. 5ఏళ్ళ తరవాత కలిసిన రవి-లాస్య జంట మునుపటి లాగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారా..లేదా అన్నది చూడాలి.

More Related Stories