English   

చంద్రబాబు తీరుపై బాలయ్య అసంతృప్తితో ఉన్నారా

Bala Krishna
2021-01-04 15:01:16

టీడీపీ అధినేత చంద్రబాబు, అల్లుడు లోకేష్ పై బాలయ్య అసంతృప్తిగా ఉన్నారా.? అంటే  పార్టీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి కారణం ఇటీవల పార్టీలో జరిగిన పరిణామాలే అని గుస గుసలు వినిపిస్తున్నాయి. పందుల్లా గుంపులు గుంపులుగా కాకుండా బాలయ్య సింహంలా సింగిల్ గా ఉండలనుకుంటున్నారట. దాంతో ఆయనకు ఇచ్చిన పొలిట్ బ్యూరో సభ్యత్వం తో సంతృప్తి చెందలేదట. 25మందిలో ఒకడిగా ఉండటం బాలయ్యకు ఇష్టం లేదని..సింహం లా సింగిల్ గా ఉండటమే ఇష్టమని అందుకోసమే ఆయన ప్రత్యేక పదవి హోదా కావాలని కోరుతునట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా బాలకృష్ణ పార్టీ ప్రెసిడెంట్ పదవిని కోరుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ పదవి ఇవ్వకుండా చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవ్వడంపై బాలయ్య అసంతృప్తిగా ఉన్నారట. పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికైన బాలయ్యకు ఇతర నేతలు  కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేస్తే ఆయన మాటల తీరుతో విషయం అర్థమైపోయిందట. మరోవైపు బాలయ్య పదవి వ్యవహారం కుటుంబం లో కూడా కలహాలకు దారి తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతిరాజు తదితరులు గైహాజరైనా బాలయ్య రాకపోవడం చర్చగా మారింది.
 

More Related Stories