నాన్‌స్టాప్ గా పుష్ప షూట్..మారేడుమిల్లి అడవులకు అల్లు అర్జున్

అల్లు అర్జున్ సుకుమార్ ల పుష్ప సినిమా షూటింగ్ కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభిచనుంది సినిమా యూనిట్ .ఇక జనవరి 8 నుండి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తిరిగి షూటింగ్ మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జనవరి 7న అల్లు అర్జున్ లొకేషన్‌కు చేరుకుంటాడని తెలుస్తుండగా, 8 నుండి మరో నెలల రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్ చిత్రీకరించనున్నారని సమాచారం. అడవి నేపథ్యంలో సాగుతుండడంతో ఈ సినిమాను చాలా వరకు కేరళ అడవుల్లో చిత్రీకరించాలనీ భావించారు దర్శక నిర్మాతలు. కానీ కరోనాతో ఆ ప్లాన్స్ అన్ని తారుమారు అయ్యాయి. ఇక ఈ సినిమా కూడా సుకుమార్ సక్సెస్ మంత్ర అయినా... రివెంజ్ ఫార్ములాతోనే తెరకెక్కబోతుందని తెలుస్తోంది. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే.