రవితేజ క్రాక్ సెన్సార్ పూర్తి

మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ అందుకుంది. సినిమాలో వయోలెన్స్ కూడా ఎక్కువగానే ఉండటంతో యు కు తోడుగా ఏ కూడా ఇచ్చారు సెన్సార్ బోర్డ్. జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ముందు జనవరి 14న విడుదల చేయాలనుకున్నా కూడా రెడ్ సినిమాతో పోటీ ఎందుకుని ఐదు రోజులు ముందుకొచ్చేసాడు రవితేజ.గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పోతరాజు శంకర్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌తో సినిమాపై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.