మళ్ళీ బీజేపీ గూటికి చేరిన జీవితా రాజశేఖర్

వైఎస్ఆర్ సమక్షంలో 2004 లో జీవితా రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరవాత 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తరవాత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలోకి చేరారు. అయితే మధ్యలో జగన్ తో విబేధాలు రావడం వల్ల తెలుగు దేశం పార్టీకి మద్దతు తెలుపుతూ టీడీపీలోకి చేరారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైసీపీ లోకి చేరారు. కానీ ముఖ్యమంత్రి జగన్ వీరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేసారు.
దాంతో సహనం కోల్పోయిన జీవిత రాజశేఖర్ మళ్ళీ తిరిగి బీజేపీ గూటికి చేరడం విశేషం. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో జీవిత బీజేపీలోకి చేరారు. అయితే సమావేశంలో బండి సంజయ్ జీవిత కు పార్టీ కండువా కప్పేందుకు నిరాకరించారు. దాంతో జీవిత స్వయంగా పార్టీ కండువాని కప్పుకున్నారు. ఇన్నేళ్లు ఏపీ రాజకీయాలపై దృష్టిపెట్టిన జీవిత రాజశేఖర్ ఈ సారి తెలంగాణపై దృష్టి పెట్టినట్టు రాబోయే ఎన్నికల్లో జీవిత జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.