English   

చెల్లెమ్మా నీకే చెపుతున్నా నా మాట విను..ఎన్టీఆర్ వీడియో

 Jr ntr
2021-01-05 14:16:34

రాఖీ, టెంపర్ సినిమాల్లో అమ్మాయిలపై జరుగుతున్న దాడులను హీరోగా ఎదిరించిన ఎన్టీఆర్ ఇప్పుడు రియల్ లైఫ్ లోను "చెల్లెమ్మా జాగ్రత్త" అంటూ ధైర్యం చెపుతున్నాడు. సినిమాల్లో ఆడవాళ్లపై జరుగుతున్న దాడులపై డైలాగ్స్ పేల్చిన తారక్ ను చూసి ఇలాంటి అన్న ఉండాలంటూ అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు నిజ  జీవితంలోనూ మహిళల కోసం నా వంతు సహాయం చేస్తాను అని ఓ మంచి పని చేయడానికి ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఆకతాయిలు, కొన్ని ముఠాలు ఫేస్ బుక్ లో అమ్మాయిలకు గాళం వేసి తరవాత ప్రేమ పేరుతో వేధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ పోలీసులు ఎన్టీఆర్ తో ఓ వీడియోను రూపొందించారు. ఆ వీడియో ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. వీడియోలో ఎన్టీఆర్ "చెల్లెమ్మా నీకే చెపుతున్నా జాగ్రత్తగా విను. ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ల పై జాగ్రత్తగా ఉండు. ఒకవేళ బాధితులుగా మారినా పోలీసులకు ఫిర్యాదు చేయండి" అంటూ అవగాహన కల్పిస్తున్నారు.

More Related Stories