English   

ఎన్టీఆర్ ను అంకుల్ అనేవాన్ని..లక్ష్మీ పార్వతి కొడుకు షాకింగ్ కామెంట్స్

 Lakshmi Parvathi Son
2021-01-05 15:12:48

ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతీ ల బంధం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన లక్ష్మీ పార్వతి ఆయన మరణం తరువాత చంద్రబాబుకు విరోదిగా మారింది. అంతే కాకుండా తనకంటూ రాజకీయాల్లోనూ ఓ వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీ పార్వతి లెక్చరర్ గా ఉద్యోగం చేసేది. ఆమె అదే జిల్లాకు చెందిన వీరగంధం వీరగంధం వెంకట సుబ్బారావును వివాహం చేసుకుంది. సుబ్బారావు హరికతకుడు ఆయన అనేక స్టేజ్ షోలు ఇచ్చేవారు. ఆయనతో కలిసి లక్ష్మీ పార్వతి కూడా స్టేజ్ షోలలో పాల్గొనేది. 

కాగా ముందు నుండి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన లక్ష్మీ పార్వతి  1987లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను రాసేందుకు ఆయన్ను కలిసింది. అదే సమయంలో భార్యను కోల్పోయి బాధపడుతున్న ఎన్టీఆర్ కు దగ్గరయ్యింది. ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి అది కాస్త పెళ్లివరకూ వెళ్ళింది. దాంతో లక్ష్మీ పార్వతి తన భర్తకు విడకులు ఇచ్చి ఎన్టీఆర్ ను వివాహం చేసుకుంది. అయితే అప్పటికే లక్ష్మీ పార్వతి-సుబ్బారావు లకు ఓ కుమారుడు ఉన్నారు. ఆయనే డాక్టర్ కోటేశ్వర ప్రసాద్. తాజాగా కోటేశ్వర ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఇంటర్వ్యూ లో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ "ఎన్టీఆర్ గారిని అంకుల్ అని పిచేవాడినని అన్నారు. నాన్న అని ఎప్పుడు పిలవలేదని చెప్పారు. ఎన్టీఆర్ ను కలిసింది కేవలం సార్లేనని..వారి వివాహం జరిగినప్పుడు ఇంటర్ చదువుతునట్టు పేర్కొన్నాడు. ఎన్టీఆర్ మరణం తరువాత తన తల్లి ఇబ్బందులు ఎదురుకుందని చెప్పారు. ఆ సమయంలో తల్లి లక్ష్మీ పర్వతితో ఉన్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ కు క్లోజ్ గా ఉన్న కుటుంబ సభ్యులే అసలు రంగు భయట పెట్టారని వ్యాఖ్యానించారు. అప్పుడు అసలు రాజకీయం అంటే ఇదేనేమో అనిపించిందన్నారు.

More Related Stories