English   

రెండో పెళ్లి చేసుకున్న రాఘవేంద్రరావు మాజీ కోడలు..ఫోటోస్ వైరల్

Kanika Dhillon
2021-01-05 16:33:17

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ వివాహం చేసుకున్న కనికా థిల్లాస్ కొన్నాళ్ళకు విడాకులు తీసుకుంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వీళ్ళు విడిపోయారు. అప్పటినుండి ఒంటరిగానే ఉన్న కనికా ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ రచయిత హిమాన్షు శర్మ తో కనికా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది. ఇక కనికా కూడా వృత్తి పరంగా రచయిత కావడంతో ఇద్దరు మరింత దగ్గరయ్యారు. డిసెంబర్ లో అతి కొద్ది మంది సమక్షంలో ఈ జంట ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక తాజాగా నేడు ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యింది. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కనికా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రయాణం అంటూ పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా కనికా థిల్లాన్ "జడ్జిమెంటల్ హై క్యా, మన్మర్జియన్" సినిమాలకు రచయితగా వ్యవహరించింది. హిమాన్షు "తను వెడ్స్ మను, రాణి జానా" సినిమాలకు కథ అందించారు.

More Related Stories