English   

ఆర్ఆర్ఆర్ టీజర్ పై మరో కీలక అప్డేట్

RRR Movie Teaser
2021-01-06 11:25:45

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "ఆర్ఆర్ఆర్". ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో...చరణ్ మన్యం పులి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో టాలీవుడ్ తారలతో పాటు బాలీవుడ్ మరియు ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. 

ఇక సినిమాల్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబందించిన టీజర్ లను చిత్ర యూనిట్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టాయి. ఇదిలా ఉండగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా నుండి సాలీడ్ టీజర్ ను యూనియ్ విడుదల  చేయబోతుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీజర్ పై మరో టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ లో మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం పై పూర్తి క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.

More Related Stories