కళ్యాణ్ రామ్‌తో రొమాన్స్ చేయబోతున్న కేథరిన్

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వేణు మల్లిడి దర్శకత్వంలో తుగ్లక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటించేందుకు కేథరిన్‌ను ఎంపికచేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇటీవల కేథరిన్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఈ సినిమాలో ఫాంటసీ అంశాలు మరియు గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తన పాలన విధానాలతో అపఖ్యాతి పొందిన రాజుగా, నేటి యువకుడిగా భిన్న పార్శాలతో ఆయన పాత్రలు సాగనున్నట్లు సమాచారం. కేథరిన్ గతేడాది విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో స్మితా మేడంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ప్లాప్ తర్వాత కొత్త సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.