English   

కేసీఆర్ బంధువుల కిడ్నాప్‌.. భూమా అఖిలప్రియ అరెస్ట్‌

Bhuma Akhila Priya arrested
2021-01-06 12:58:15

హైదరాబాద్ లో ఉత్కంఠ రేపిన సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు, భర్త భార్గవరామ్‌ను కూడా బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బోయినపల్లిలో కిడ్నాప్‌కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో  ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్‌ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్‌ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. 

గత రాత్రి 11 గంటల సమయంలో  సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు కిడ్నాప్‌‌కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్‌రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్‌ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వికారాబాద్‌లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

More Related Stories