English   

క్రాక్ పై బాలీవుడ్ క్రిటిక్ నెగిటివ్ ప్రచారం..

Ravi teja
2021-01-06 15:26:14

సాధారణంగా సినిమా విడుదలయ్యాక చూసి సినిమా ఎలా ఉందో చెప్పడం కామన్. కానీ ఈ మధ్య సినిమా విడుదల కాకముందే...సినిమా చూడకముందే నెగిటివ్ ప్రచారం మొదలు పెడుతున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ నటించిన క్రాక్ సినిమాపై ఓ బాలీవుడ్ క్రిటిక్ నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టాడు. రోహిత్ జైష్వాల్ అనే మూవీ క్రిటిక్ తన ట్విట్టర్ ఖాతాలో ఏ ప్రచారాన్ని మొదలు పెట్టాడు. క్రాక్ కు మినిమమ్ బజ్ లేదని..అసలు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ లేదని కచ్చితంగా ఓపెనింగ్స్ కూడా రావని ప్రచారం చేస్తున్నాడు. నిజానికి టికెట్ ఇంకా టికెట్ హైక్ కన్ఫామ్ అవ్వలేదు. థియేటర్స్ ఫైనల్ కౌంట్ ఇంకా రాలేదు. బుకింగ్స్ కూడా అన్ని సెంటర్లలో ఓపెన్ అవ్వలేదు. 

అయినా పూర్ ఓపెనింగ్స్ వస్తాయంటూ క్రిటిక్ చేస్తున్న కామెంట్స్ పై కేవలం రవితేజ ఫ్యాన్స్ కాకుండా తెలుగు ఆడియన్స్ అంతా మండిపడుతున్నారు. అసలు నీకు టాలీవుడ్ స్టామినా తెలుసా అంటూ క్రిటిక్ ను ఏసుకుంటున్నారు. ట్వీట్ డిలీట్ చెయ్ అంటూ ఫైర్ అవుతున్నారు. దాంతో క్రిటిక్ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసాడు. తనకు మాహా మహరాజ్ అంటే అభిమానం అని కానీ ఈ సినిమా హైప్ మాత్రం తక్కువగానే ఉందని సినిమా విడుదలయ్యాక సపోర్ట్ చేస్తానని..ఎంత కావాలంటే అంత తిట్టుకోవాలని బరి తెగించేసాడు. మరోవైపు క్రాక్ కు నెగిటివ్ ప్రచారం చేస్తు విజయ్ నటించిన "మాస్టర్" సినిమాపై వరుస పాజిటివ్ ట్వీట్స్ చేయడం కూడా అనుమానాలకు దారి తీస్తుంది. ఇక ఈ క్రిటిక్ కు బుద్ధి చెప్పాలని..క్రాక్ రికార్డులు బద్దలు కొట్టాలని సినిప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

More Related Stories