English   

ఆచార్య సెట్ లో మొబైల్ ఫోన్లు పంచిన సోనూ సూద్

Sonu Sood
2021-01-06 15:38:49

లాక్ డౌన్ వేళ నటుడు సోనూ సూద్ సేవా కార్యక్రమాలతో ఆపదలో ఉన్నవారికి ఆశా జ్యోతిగా మారాడు. లాక్ డౌన్ లో ఉపాధికోసం సొంత ఊర్లను వదిలి వచ్చిన వలస కూలీలను   తన డబ్బులతో స్వగ్రామాలకు పంపించాడు. అంతే కాకుండా వారికి దగ్గరుండి భోజనాలు ఏర్పాటు చేసి బాగోగులు చూసుకున్నాడు. మరోవైపు నీట్ పరీక్షకు వెళ్ళడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి స్పెషల్ ట్యాక్సీలు ఏర్పాటు చేశాడు. ఇక లాక్ డౌన్ తరవాత కూడా సోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాడు. 

ఏపీలో ఓ రైతు కాడెద్దులు లేక కూతుళ్ళ సహాయంతో పొలం దున్నడం సోషల్ మీడియాలో చూసిన సోనూ సూద్ సాయంత్రానికల్లా ట్రాక్టర్ పంపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలు బోలెడు. ఇక ప్రస్తుతం సోనూసూద్ "ఆచార్య" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆచార్య సెట్ లో పని చేస్తున్న పేద వర్కర్లకు మొబైల్స్ పంచి పెట్టాడు. మొత్తం 100మంది వర్కర్లకు సోనూ మొబైల్స్ పంచి పెట్టాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విడుదలకు సిద్దంగా ఉన్న అల్లుడు అదుర్స్ సినిమాలోనూ సోనూసూద్ కీలక పాత్రలో నటించారు.

More Related Stories