English   

రామ్ రెడ్.. నువ్వే నువ్వే వీడియో సాంగ్ వచ్చేసింది 

RED Nuvve Nuvve Video Song
2021-01-06 15:58:05

ఈ సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు రామ్ పోతినేని. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఇటీవలే 'రెడ్' ట్రైలర్ మరియు 'డించక్' అనే ఐటమ్ సాంగ్ ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'రెడ్' నుంచి ‘నువ్వే నువ్వే’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఫారిన్ లోకేషన్స్ లో తెరకెక్కించిన ఈ సాంగ్ చాలా రిచ్ గా విజువల్ ట్రీట్ లా కనిపిస్తోంది. దీనికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇందులో మాళవిక శర్మ - రామ్ ల మధ్య కెమిస్ట్రీ.. సింపుల్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇస్మార్ట్ శంకర్'కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, 'రెడ్'కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు.

More Related Stories