రానా దగ్గుబాటి అరణ్య రిలీజ్ డేట్

2021-01-06 23:24:34
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన అరణ్య చిత్రానికి విడుదల తేదిని ప్రకటించారు. ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు రానా. సరికొత్త సాధారణ వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అరణ్యను మార్చి 26న మీ ముందుకు తెస్తున్నాం. సినిమా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న వారికి, నాకు , మా టీంకు సపోర్టుగా నిలిచి ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు.ఇతర పాత్రల్లో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ నటించారు.