మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి కరోనా నెగటివ్

మెగా ఫామిలీలో ఇటీవల కరోనా కలవరం రేపిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో మెగా ఫ్యామిలీ మొత్తం క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ జరుపుకున్న రెండు రోజులకి కరోనా పాజిటివ్ వచ్చిందని రామ్ చరణ్ ప్రకటించారు. ఆ వెంటనే వరుణ్ తేజ్ తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు. దీంతో మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని ఆందోళన చెందారు. కానీ ఈ ఇద్దరికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వారం రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షలో వరుణ్‌తేజ్‌కి కరోనా నెగటివ్ అని తేలడంతో సంతోషంలో మునిగితేలారు. 'నెగటివ్ అనే రిపోర్టు ఇంత ఆనందాన్ని ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదు' అంటూ హీరో వరుణ్ ట్వీట్ చేశారు. కోవిడ్ నెగిటివ్ వచ్చిందని, తన కోసం ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ కృతఙ్ఞతలు అని వరుణ్ పేర్కొన్నారు. మరోవైపు హీరో రామ్‌చరణ్‌కి సంబంధించి అప్డేట్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.