English   

గోపీచంద్ తో సినిమా...డిఫరెంట్ గా అనౌన్స్ చేసిన మారుతి

Gopichand
2021-01-07 14:00:22

దర్శకుడు మారుతి తన తదుపరి సినిమాను హీరో గోపిచంద్ తో తీయబోతున్నట్టు ప్రకటించాడు. అయితే రోటీన్ గా కాకుండా మారుతి ఈసారి డిఫరెంట్ గా తన సినిమా అనౌన్స్మెంట్ చేసాడు. దానికోసం ఓ ప్రత్యేక వీడియోను రూపొందించారు. వీడియోలో ప్రతిరోజు పండగే సినిమా తరవాత మారుతి గోపిచంద్ తో సినిమా చేస్తున్నట్టు స్పష్టం చేసాడు. మరోవైపు గోపిచంద్ కూడా మారుతి సినిమాలో నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జిఏ2 నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంభందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తామని గోపిచంద్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను సైతం చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

More Related Stories