English   

దిష్టిబొమ్మలు గా కాజల్ తమన్నా...ఇలా కూడా వాడేస్తారా

Kajal And Tamanna
2021-01-07 14:14:09

సాధారణంగా హీరోయిన్ ల ఫోటోలను షాపింగ్ మాల్స్ పబ్లిసిటీ కోసమో..బ్యూటీ ప్రోడక్ట్స్ పబ్లిసిటీ కోసమో వాడుతుంటారు. కానీ తాజాగా తెలంగాణలోని ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేటలోని చంద్రమౌళి అనే రైతు రెండు ఎకరాల్లో మిర్చి పంటను పండిస్తున్నాడు. కాగా పంటకు ఒకరకమైన తెగులు సోకి నష్టం కలుగుతోంది.దాంతో తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. అయితే సాధారణంగా పంటకు దిష్టి తగిలితే దిష్టి బొమ్మలను పెడతారు. 

కానీ చంద్రమౌళి మాత్రం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న ఇద్దరు టాప్ హీరోయిన్ లు తమన్నా, కాజల్ అగర్వాల్ ల ప్లెక్సీలను దిష్టి బొమ్మలుగా ఏర్పాటు చేసాడు. హీరోయిన్ ల ఫోటోలు పెట్టడం వల్ల పంట పై నజర్ పడదు అనేది చంద్రమౌళి ఆలోచన. ఇదిలా ఉండగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ ముద్దు గుమ్మ అటు వైవాహిక జీవితాన్ని..ఇటు సినిమా లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్ షోలు చేస్తూ బిజీగా వుంది.

More Related Stories