English   

సంక్రాంతి సందడికి శ్రీకారం చుట్టిన శర్వానంద్

Sreekaram song
2021-01-07 17:52:18

హీరో శర్వానంద్ డెబ్యూ డైరెక్టర్ కిషోర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా శ్రీకారం. ఇదివరకే ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అనే సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‏కు ప్రేక్షకుల నుంచి మంచి స్పంధన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ టీజర్‏ను విడుదల చేశారు చిత్రయూనిట్. సందల్లే, సందల్లే సంక్రాంతి సందల్లే అంటూ సాగే ఈ పాట పూర్తిగా పండగా వాతావరణం కనిపించేలా రూపొందించారు.

రాబోయే సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ కి తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ మంచి ట్యూన్ అందించాడు. 'మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా.. మన వారితో కలిసుండటం ఓ వరమేరా..' అంటూ దీనికి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించాడు. సింగర్స్ అనురాగ్ కులకర్ణి - మోహన భోగరాజు ఆలపించారు. ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ శోభి ఆధ్వర్యంలో శర్వా వేసిన స్టెప్పులు అలరిస్తున్నాయి. శతమానం భవతి సూపర్ హిట్ తర్వాత శర్వానంద్ ఎలాంటి హిట్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన జాను, రణరంగంలో అంతగా విజయం శాదించలేకపోయాయి. ఇక ప్రస్తుతం శర్వా నటించే శ్రీకారం సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

More Related Stories