English   

లవ్ స్టోరీ టీజర్ డేట్..చైతన్య చెవిలో చెప్పిన సాయి పల్లవి 

 Love Story
2021-01-07 19:33:22

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘‘లవ్ స్టోరీ’’ . ‘‘ఫిదా’’ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా వున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. జనవరి 10,ఉదయం 10:08 గం.లకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ రాబోతుంది. ఈ పోస్టర్లో నాగ చైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది. చూడ ముచ్చటగా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More Related Stories